తెలంగాణలో రాబోయే మూడు రోజులు ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల సమయంలో బయటకు వెళ్లకపోవడమే మంచిదని సూచనలు చేసింది.

ఎండ వేడిమి నుంచి తమను తాము రక్షించుకునేందుకు అధికంగా నీరు తాగాలని, చెప్పులు ధరించే బయటకు వెళ్లాలని పేర్కొ్ంది. దీనికి తోడు డీ హైడ్రేట్ కాకుండా ఉండేందుకు సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలని, ఓఆర్ఎస్, ఫ్రూట్ జ్యూసెస్ తాగాలని ఆరోగ్య సూచనలు చేసింది. ఒంటరిగా బైకుల మీద వెళ్లే వారు పబ్లిక్ ట్రాన్స్ పోర్టును ఆశ్రయించాలని కోరింది. అధిక వేడి నుంచి రక్షణ కోసం మధ్యాహ్నం పనులు వాయిదా వేసుకోవాలని స్పష్టంచేసింది.