సినిమాల్లోకి వస్తున్న జగ్గారెడ్డి…పాత్ర ఏంటంటే ?

-

కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్సీ జగ్గారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో సినిమాల్లోకి జగ్గారెడ్డి రాబోతున్నాడట. లవ్ స్టోరీలో స్పెషల్ రోల్ లో నటించనున్నారు జగ్గారెడ్డి. ఈ మేరకు చిట్‌ చాట్‌ లో వెల్లడించారు కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్సీ జగ్గారెడ్డి. నా ఒరిజనల్ క్యారెక్టర్ కు సినిమాలోని రోల్ అద్దం పట్టనుందని… అందుకే సినిమాలో నటిస్తానని ప్రకటించారు. పీసీసీ, సిఎం రేవంత్‌ రెడ్డిల అనుమతి తోనే సినిమాలో నటిస్తానని వెల్లడించారు.

jaggareddy

ఈ ఉగాదికి సినిమా స్టోరీ వింటానని… వచ్చే ఉగాదికి సినిమా విడుదల కానుందన్నారు. ఒక వ్యక్తి కలిసి.. నా క్యారెక్టర్ కు తగ్గట్టుగా క్యారెక్టర్ ఉన్న సినిమా ఉందని చెప్పాడని పేర్కొన్నారు. సినిమాలో నటించమని అడిగారన్నారు. ఇంటర్వల్ ముందు మొదలయ్యే పాత్ర, సినిమా చివరి వరకు ఉంటుందని తెలిపారు కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్సీ జగ్గారెడ్డి. కాగా… మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి లో ఓడిపోయారు కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్సీ జగ్గారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news