ఘోర ప్రమాదం.. లారీని ఢీకొట్టింది ఓ ఆర్టీసీ బస్సు. ఈ సంఘటన లో 20 మందికి గాయాలు అయ్యాయి. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు జిల్లా వట్లూరు సమీపంలో హైవేపై లారీని ఢీకొట్టింది ఓ ఆర్టీసీ బస్సు. ఈ సంఘటన మంగళ వారం రాత్రి జరిగినట్లు సమాచారం. కాకినాడ నుంచి గుంటూరు వెళుతున్న బస్సు…. వేగంగా వచ్చి లారీని ఢీకొట్టింది.

ఇక ఈ ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇందులో 20 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు స్థానికులు. ఇక అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు.. దీనిపై కేసు నమోదు చేసుకున్నారు. ఇక పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.