జర్నలిస్టు రేవతి అరెస్ట్‌..రంగంలోకి కేటీఆర్

-

సీనియర్ మహిళా జర్నలిస్టు రేవతి అరెస్టును తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవాళ ఉదయం 5 గంటలకి రేవతి గారి ఇంటిపై దాడిచేసి ఆమెతోపాటు కుటుంబ సభ్యులను నిర్బంధించి ప్రభుత్వం వేధింపులకు గురిచేసిందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి తన కుటుంబంతో పాటు, తనపైన ఒత్తిడి చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారని రేవతి స్వయంగా ఆరోపించిన నేపథ్యంలో.. ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడాలన్నారు.

KTR

రేవతితో పాటు యువ జర్నలిస్టు తన్వి యాదవ్‌ను అరెస్టు చేయడం దారుణం అంటూ ఫైర్‌ అయ్యారు. ప్రజా ప్రభుత్వం అని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి.. తెలంగాణను నియంతల రాజ్యంగా రేవంత్ రెడ్డి మార్చిండని ఆగ్రహించారు.

తెల్లవారకముందే చట్ట వ్యతిరేకంగా మహిళా జర్నలిస్ట్ రేవతిని అరెస్టు చేసిన తీరు, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో మీడియాపై విధించిన ఆంక్షలను, ఎమర్జెన్సీ నాటి దుర్మార్గపు రోజులను గుర్తుకు తెస్తున్నాయన్నారు. రాహుల్ గాంధీ చెబుతున్న రాజ్యాంగబద్ధమైన పాలన ఇదేనా.. ప్రజా పాలనలో మీడియా స్వేచ్ఛ అనేదే లేకుండా పోయిందని.. రేవంత్ రెడ్డి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మీడియా మీడియా, సోషల్ మీడియా గొంతుకలపై చేస్తున్న ఈ దాడులను, అక్రమ కేసులను వెంటనే ఆపాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news