ఉస్మానియా యూనివర్సిటీలో అన్నంలో బ్లేడులు, పురుగులు వచ్చాయని విద్యార్థులు రచ్చ చేశారు. దీంతో ఉస్మానియా యూనివర్సిటీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. భోజనంలో పురుగులు, రక్తంతో కూడిన బ్లేడు రావడంతో.. విద్యార్థులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓయూ స్టూడెంట్స్ నినాదాలు చేస్తున్నారు.

ఇలాంటి భోజనం తింటే.. విద్యార్థుల పరిస్థితి ఏంటంటూ విద్యార్థులు మండి పడుతున్నారు. తమకు న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్నారు.. దీంతో రంగంలోకి పోలీసు అధికారులు… వాళ్లను చెదగొట్టారు. ఇక ఓయూలోని హాస్టల్ భోజనంలో పురుగులు, బ్లేడు రావడంపై.. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఫైర్ అయ్యారు.
మీరేమో రూ.11 వేల కోట్లతో ప్రపంచస్థాయి హైటెక్ సమీకృత గురుకులాలని అంటున్నారని ఆగ్రహించారు. మరోవైపు అన్నంలో పురుగుల, బ్లేడు వస్తున్నాయని ఓయూ విద్యార్థులు ధర్నా చేస్తున్నారు… ఫస్ట్ రాజకీయాలు బంద్ చేసి.. విద్యార్థుల చదువు, ఆరోగ్యంపై దృష్టి పెట్టండంటూ ట్వీట్ చేయన్నారు.
https://twitter.com/pulsenewsbreak/status/1899504561007874138