తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు పిభ్రవరి 1వ తేదీ నుంచి పరిగణలోకి తీసుకుంటామని పాలకమండలి నిర్ణయం తీసుకుంది. కానీ ఇంత వరకు అమలు చెయ్యలేదు అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడు కాది ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు పరిగణనలోకి తీసుకున్న టీటీడీ.. ఇప్పుడు ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదు అని ప్రశ్నించారు ఎంపీ.
సీఎం ఆదేశించినా.. పాలకమండలి నిర్ణయం తీసుకున్నా.. అధికారులు ఎందుకు అమలు చెయ్యడం లేదు అని అడిగారు. అయితే తెలంగాణ ప్రజాప్రతినిధులు పట్ల టీటీడీకి ఈ రకమైన వివక్ష తగదు అని పేర్కొన్నారు. టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశమై ప్రభుత్వ నిర్ణయం అమలు చెయ్యాలి. ఈ వేసవి సెలవుల్లో సిఫార్సు లేఖలు ఇస్తాం.. పరిగణలోకి తీసుకోకపోతే.. తెలంగాణ ప్రజాప్రతినిధులు అందరు తిరుమలకు వచ్చి తేల్చుకుంటాం అని రఘునందన్ రావు అన్నారు. అయితే తెలంగాణ ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలు పరిగణనలోకి తీసుకుంటామని టీటీడీ హమినిచ్చింది.. కాబట్టి ఉమ్మడి రాష్ట్రం తరహలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు పరిగణనలోకి తీసుకోవాలి అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.