సహజంగా చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే.. ఈ మార్పులను చేసుకోండి చాలు..!

-

ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకుంటే పూర్తి ఆరోగ్యం బాగుంటుంది. అయితే ఎటువంటి ఆహార పదార్థాలను అయినా మితంగా తీసుకోవాలి. శరీరానికి తగినంత పోషక విలువలు ఉండేటువంటి ఆహార పదార్థాలను తప్పకుండా తీసుకోవాలి. ముఖ్యంగా చాలా శాతం మంది కొవ్వు పదార్థాలు కూడా అవసరం అని ఎక్కువ మోతాదులో తీసుకుంటారు. దీని వలన చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. కొలెస్ట్రాల్ శాతం ఎక్కువ అవ్వడం వలన గుండెకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాలంటే తప్పకుండా మీ డైట్ లో మార్పులను చేసుకోవాలి.

మీ డైట్ లో భాగంగా ఫైబర్ ను ఎక్కువగా తీసుకోవడం వలన చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బీన్స్, ఓట్స్, పప్పులు, అవిస గింజలు వంటి వాటిలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. అదే విధంగా తాజా పండ్లను ప్రతిరోజు తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఈ మధ్యకాలంలో సమయం లేకపోవడం వలన ప్రాసెస్ చేసినటువంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటున్నారు. వాటి వలన శరీరంలో శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ మరియు ట్రాన్స్ ఫ్యాట్స్ పెరిగిపోతాయి. ఈ విధంగా చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కనుక వీటిని ఎక్కువగా తీసుకోకపోవడం మేలు.

పప్పులు, బీన్స్, టోఫు, క్వినోవా వంటి ఆహార పదార్థాలలో ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది. ఈ విధంగా ప్లాంట్ బెస్ట్ ప్రోటీన్ తీసుకోవడం వలన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు. చిన్నవారి నుండి పెద్దవారి వరకు పంచదారను ఎంతో ఇష్టంగా తింటారు. కేక్, పేస్ట్రీస్, వైట్ బ్రెడ్, చాక్లెట్స్, డ్రింక్స్ వంటి వాటిలో పంచదార చాలా ఎక్కువగా ఉంటుంది. వీటి వలన కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది. దాంతో ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కనుక వీటికి దూరంగా ఉండటమే మేలు. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. దాంతో ఎంతో ఆరోగ్యంగా జీవించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news