కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ మంత్రి వేముల ఫైర్..!

-

తెలంగాణ రాష్ట్ర సాధకుడు, పదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్  చావును కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి జుగుప్సాకర వ్యాఖ్యలు చేశారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి  సీరియస్ అయ్యారు. శనివారం ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు పై మూడు గంటల సీఎం స్పీచ్లో స్పష్టత ఇవ్వలేదు అన్నారు. అసెంబ్లీలో సీఎంకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ప్రతిపక్ష నేతకూ అంతే ప్రాముఖ్యత ఉంటుంది.. కానీ కాంగ్రెస్
ప్రభుత్వం కేసీఆర్ పై ఉన్న అక్కసుతో ప్రతిపక్ష నేతకు ఛాంబర్ కేటాయించలేదు.


ఛాంబర్ లాక్కొని కేసీఆర్ను అవనించారని మండిపడ్డారు. పీఏసీ చైర్మన్ గా పార్టీ మారిన ఎమ్మెల్యేకు
ఎలా ఇస్తారని ప్రశ్నించారు. సీఎం మాటలు కోటలు దాటుతున్నాయి కానీ.., ఆచరణలో అడుగు ముందుకు పడటం లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని మాటిచ్చారు.. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 450 రోజులు గడుస్తున్నా
హామీలు అమలు కావడం లేదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news