రెండోసారి కూడా నేనే ముఖ్యమంత్రిని అవుతాను అంటూ ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా మీడియాతో చిట్ చాట్ లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మొదటిసారి బీఆర్ఎస్ పై వ్యతిరేకతతో మాకు ఓటేశారని తెలిపారు. రెండోసారి మాపై ప్రేమతో ప్రజలు ఓట్లు వేస్తారన్నారు.

సంక్షేమ పథకాల లబ్ధిదారులే మా ఓటర్లు అని వివరించారు. నేను పనిని నమ్ముకుని ముందుకు వెళ్తున్న… ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని ప్రకటించారు. స్టేచర్ కాదు నాకు స్టేట్ ఫ్యూచర్ ముఖ్యం అంటూ వ్యాఖ్యానించారు. మహిళలు అంతా మావైపే ఉంటారన్నారు. గతంలో నేను చెప్పిందే జరిగిందనని వివరించారు. భవిష్యత్తులో కూడా నేను చెప్పిందే జరగబోతోందని ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.