నేడు స్టేషన్‌ ఘన్‌పూర్‌లో రేవంత్‌ పర్యటన…బీఆర్‌ఎస్‌ భారీ స్కెచ్‌ !

-

నేడు స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు హెలికాప్టర్ లో శివునిపల్లెకు చేరుకోనున్నారు సీఎం రేవంత్‌. మొదట ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ సందర్శన ఉంటుంది. అనంతరం రూ.800 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు రేవంత్‌. అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Revanth’s visit to station Ghanpur today

అయితే… నేడు స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో…బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు అడ్డుకొవాలని చూస్తున్నారు. దీంతో బీఆర్‌ఎస్‌ నేతల ముందస్తు అరెస్టులు కూడా కొనసాగుతున్నాయి. స్టేషన్ ఘనపూర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేశారు స్టేషన్ ఘనపూర్ పోలీసులు. సీఎం రేవంత్ రెడ్డి సభను అడ్డుకుంటామని ప్రకటించారు బీఆర్ఎస్ మాజీ MLA తాటికొండ రాజయ్య.

Read more RELATED
Recommended to you

Latest news