కేటీఆర్‌ ను కలవడంపై తీన్మార్‌ మల్లన్న సంచలన వ్యాఖ్యలు !

-

శాసనమండలి మీడియా పాయింట్ లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీసీలకు 42 శాతం బిసి బిల్లు ప్రవేశ పెడుతున్న సందర్భంగా బీసీ జేఏసీ నాయకులం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంఐఎం అక్బరుద్దీన్, బిజెపిఎల్పీ మహేశ్వరరెడ్డి ని కలిసామన్నారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. అన్ని పార్టీల నేతలు బిసి బిల్లుకు మద్దతు తెలుపుతామని ప్రకటించారన్నారు.

Teenmar Mallanna’s sensational comments on meeting KTR

బిసిల పట్ల ఆయా పార్టీలు ప్రేమను చాటుకోవాలని కోరామని తెలిపారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. అన్ని పార్టీల మద్దతుతో ఈ బిల్లు ఆమోదించాలని రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. బిసిలకు 42 శాతం బిల్లుకు ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించాలని అన్ని పార్టీలను కోరుతున్నామని చెప్పారు. బీసీ కోసం కేటీఆర్‌ ను కలిశామన్నారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.

Read more RELATED
Recommended to you

Latest news