గోల్డ్ స్మగ్లింగ్ కేసు లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో కీలక నిందితురాలు రన్యారావు వెనుక కింగ్్పన్గా ఉన్న తెలుగు నటుడు తరుణ్ రాజు పోలీసులు ఇవాళ ఉదయం అరెస్ట్ చేశారు. అయితే, దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు చిక్కిన కన్నడ
నటి రన్యారావు ప్రస్తుతం కస్టడీలో ఉన్నారు. ఈ స్మగ్లింగ్లో ఆమె సవతి తండ్రి, సీనియర్ ఐపీఎస్ అధికారి కె.రామచంద్రరావు పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.
తాజాగా ఆయనను ఐఏఎస్ అధికారి గౌరవ్ గుప్తా నేతృత్వంలోని ఇన్వెస్టిగేషన్ టీమ్ విచారించింది. ఈ మేరకు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ రికార్డు చేశారు. పోలీసులు అదేశాల మేరకు రామచంద్రరావును సెలవుపై వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి రేపటిలోగా నివేదికను ప్రభుత్వానికి అందజేయాల్సిన నేపథ్యంలో విచారణ వేగవంతం చేసిన పోలీసులకు కీలక ఎవిడెన్స్ లభించింది. రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ వెనుక తెలుగు నటుడు తరుణ్ రాజ్ ఉన్నాడని దర్యాప్తులో తేలింది. ఈ మేరకు ఇవాళ ఉదయం బెంగళూరు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.