తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభం అయ్యాయి. రేపు అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలోనే ప్రజలకు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నది.
తాజాగా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన కాసేపటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శాసన మండలి వద్ద నిరసన తెలిపారు. ఆమె వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సైతం ఉన్నారు. గత ఎన్నికల సమయంలో మహిళలకు ఇస్తామన్న స్కూటీల విషయం ఏమైంది? ఎప్పుడిస్తారని స్కూటీ ప్లకార్డు పట్టుకుని ఆమె నిరసన వ్యక్తం చేశారు.