మంత్రి కొండా సురేఖ ఆదేశాలు బేఖాతర్.. సినిమా డైరెక్టర్ భూమి కబ్జా

-

హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్,ఎల్లమ్మ గుడి ఆలయ ఈవో కలిసి భూమి కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో అధికారులకు మంత్రి కొండా సురేఖ ఇటీవల ఆదేశాలు ఇచ్చినా వాటిని పట్టించుకోకుండా పనులు జరుపుతున్నట్లు సమాచారం. వివరాల్లోకివెళితే.. సినిమా డైరెక్టర్ సయ్యద్ రఫీకి చెందిన భూమి కబ్జాకు గురైంది.

ఎండోమెంట్ శాఖ ముసుగులో మంత్రి కొండా సురేఖ ఆదేశాలను కూడా లెక్క చేయకుండా గుడి ఈవో, అధికారులు ఆయన భూమిలో పిల్లర్లు వేసినట్లు సమాచారం. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న రఫీ.. గద్దర్‌తో కలిసి ‘ఇంకెన్నాళ్ళు’ అనే సినిమాను తీశాడు.

హుస్నాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎల్లమ్మ గుడికి సోదరభావంతో తన 4 ఎకరాల 4 గుంటల భూమిని రఫీ, తన నలుగురు సోదరులు కలిసి దానం చేసినట్లు తెలిసింది. దాని విలువ దాదాపు రూ.32 కోట్లు. అయితే, ఆ భూమి పక్కన ఉత్తరం వైపు సర్వే నంబర్ 264లో 32 గుంటల తమ ప్రైవేట్ భూమిని ఆ గుడి ఈవో, ఇంకా కొందరు కలిసి ఎండోమెంట్ ముసుగులో కబ్జా చేస్తున్నట్లు రఫీ ఆరోపించారు.

ఆ గుడి ఈవో ఇంకా కొందరు కలిసి, రెండో శనివారం, ఆదివారం రోజుల్లో రాత్రిపూట లైట్లు పెట్టి మరీ ఎండోమెంట్ ముసుగులో కబ్జా చేస్తున్నారని రఫీ మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, ఈ దుశ్చర్యలను తక్షణమే నిలిపివేసి, ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రఫీ, అతని సోదరులు డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news