దోమలు విజృంభిస్తున్నాయి.. అధికారుల నిర్లక్ష్యం వల్లే : ఎమ్మెల్యే కౌసర్

-

హైదరాబాద్‌‌లో దోమలు విపరీతంగా వ్యాప్తి చెందుతున్నాయని, ఫలితంగా విషజ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయని ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దిన్ అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే దోమలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

కొద్ది నెలల నుంచి హైదరాబాద్‌లో దోమలు విపరీతంగా పెరిగి ప్రజలు మలేరియా, డెంగ్యూ లాంటి రోగాలతో బాధపడుతున్నారు.రోగులతో ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఆసుపత్రులు నిండిపోయాయి అని ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుని దోమల బారి నుంచి ప్రజలను కాపాడాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news