రాష్ట్రంలో పన్నులు ఎక్కువ వసూలు చేయాలని టార్గెట్స్ పెట్టి వేధిస్తున్నారని బిల్ కలెక్టర్లు నిరసనకు దిగారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోజు లక్ష రూపాయలు పన్నులు వసూలు చేయాలని టార్గెట్ పెడుతున్నారని, టార్గెట్ పూర్తి చేయని బిల్లు కలెక్టర్లకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం, జీతం నుంచి కట్ చేయడం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ శక్తికి మించి పన్నులు వసూలు చేస్తున్నామని, చిన్న ఉద్యోగులపై ఇటువంటి బెదిరింపులు ఏంటని బిల్ కలెక్టర్లు ఆందోళనకు దిగినట్లు తెలిసింది. బిల్ కలెక్టర్ల డిమాండ్లు విని, మున్సిపల్ కమిషనర్‌తో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని అసిస్టెంట్ కమిషనర్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.