చొప్పదండి ఎమ్మెల్యే, కలెక్టర్ సందీప్ ఝాకు చేదు అనుభవం

-

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో వింత అనుభవం ఎదురైంది.చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను మహిళలు నిలదీశారు. రేషన్ కార్డులు ఇవ్వలేదు కానీ సన్న బియ్యం ఇస్తామని వచ్చారా? అంటూ స్థానిక మహిళలు నిలదీశారు.

ఇంతకు ముందు ఇస్తామన్నవి అన్ని ఇచ్చారా? రూ.500 గ్యాస్,మహిళలకు నెలకు రూ.2500, రుణమాఫీలు కాలేదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. రేషన్ కార్డుల్లో కూడా తమ పేర్లు ఇంకా నమోదు కాలేదంటూ ఎమ్మెల్యేను, అధికారులను మహిళలు నిలదీయడంతో ఏం చేయలేక, వారికి సర్ధిచెప్పలేక మౌనంగా వెనుదిరగాల్సి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news