అటవీశాఖ మంత్రి లేకుండా HCU వివాదంపై కమిటీ ఏర్పాటుకు సర్కార్ నిర్ణయం

-

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పరిధిలోని భూవివాదంపై కమిటీ ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలు తీసుకోవాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం. అయితే, అందులో అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పేరు లేకుండా కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

సీఎం రేవంత్ సర్కార్ ఆలోచన లేకుండా తీసుకుంటున్న నిర్ణయాలు బ్యాక్ ఫైర్ అవుతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే సుప్రీంకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఈ క్రమంలోనే HCU భూవివాదంపై మంత్రులతో కమిటీ ఏర్పాటుకు సీఎం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కమిటీలో అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పేరు లేకుండానే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, HCU కార్యనిర్వాహక కమిటీ, పౌర సంఘాలు, HCU విద్యార్థులు, స్టేక్ హోల్డర్స్ తో కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news