సీఎం రేవంత్‌పై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్.. AI వీడియాలంటూ ఎలా చెప్తారు? : మీనాక్షి నటరాజన్

-

సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదం పై రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ స్వయంగా రంగంలోకి దిగి విచారణ చేపట్టినట్లు సమాచారం.ఆదివారం HCU విద్యార్థులు, ప్రొఫెసర్ లను మీనాక్షి కలిసి అక్కడి పరిస్థితిపై ఆరా తీసినట్లు తెలిసింది.

వన్యప్రాణులు లేవని,అటవీ ప్రాంతం లేదని చెప్పడంతో రేవంత్‌ను మీనాక్షి నటరాజన్ మందలించినట్లు సమాచారం.అక్కడ జింకలు, నెమళ్ళు లేవు, అదంతా AI సృష్టి అంటూ సోషల్ మీడియాలో రాతలు ఎలా రాయిస్తరంటూ రేవంత్ పై ఆమె అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మీ తీరు వల్ల జాతీయ స్థాయిలో పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇకపై HCU వివాదం పై పార్టీ నేతలు ఎవరు మాట్లాడొద్దని.. సోషల్ మీడియాలో కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయించొద్దంటూ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news