తెలంగాణలో కొత్త భూ చట్టం తీసుకురావాలని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం నారాయణపేట జిల్లా మద్దూరు మండలం ఖాజీపూర్‌లో భూ భారతి పోర్టల్ పైలెట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి దేశానికే రోల్ మోడల్ అని చెప్పారు.రైతుల కష్టాలు తీరాలని, అందరికీ మంచి జరగాలని భూభారతి పోర్టల్‌ను తెచ్చామన్నారు. ‘ధరణి’ని అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ లక్షలాది ఎకరాలను దొచేసిందని ఆరోపించారు. ధరణిలో తప్పులు ఉన్నాయంటూ బీఆర్ఎస్ నేతలే తన వద్దకు వచ్చారని వివరించారు. అసెంబ్లీలో తనను ప్రత్యేకంగా కలిసి తప్పులు సరిదిద్దాలని కోరారని గుర్తుచేశారు. గత ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన వారు కూడా తన వద్దకు వచ్చిన వారిలో ఉన్నారన్నాారు.