ఆ రెండు పార్టీలు బీజేపీని ఓడించాలని కంకణం కట్టుకున్నాయి : ఎంపీ లక్ష్మణ్

-

హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ సీనియర్ నేత,రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎంఐఎం‌తో ఆ రెండు పార్టీలు లాలూచీ పడ్డాయని విమర్శించారు. అన్ని పార్టీలు ఏకమై బీజేపీని దెబ్బ కొట్టాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంను గెలిపించాలని కంకణం కట్టుకున్నారని ధ్వజమెత్తారు.కానీ,తెలంగాణలో బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదుగుతోందన్నారు.ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో రాష్ట్రంలో తాము స్వతంత్రంగానే అధికారంలోకి రావడం పక్కా అంటూ జోస్యం చెప్పారు. తమ ముందు బీఆర్ఎస్, కాంగ్రెస్ పన్నాగాలు పని చేయబోవన్నారు.ఓటింగ్ దూరంగా ఉండాలంటూ తమ కేడర్‌కు పార్టీలు సూచిస్తున్నాయని ఆయన విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news