హైద్రాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీకి ఎందుకు మద్దిస్తున్నారని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు. అయితే, ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎన్నికకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.
అంతేకాకుండా, ఈ రెండు పార్టీలు మజ్లిస్ పార్టీకి పరోక్షంగా మద్దతు ఇస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.మజ్లిస్ పార్టీ అడుగులకు మడుగులు ఎందుకు ఒత్తుతున్నారు? అని ప్రశ్నించారు.మజ్లిస్ గెలుపు కోసమే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు కాంగ్రెస్, బీఆర్ఎస్ దూరంగా ఉన్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.