బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు హైకోర్టులో భారీ ఊరట దొరికింది.గతంలో ఆయనపై నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ పరిధిలోని ఉట్నూర్ పీఎస్‌లో నమోదైన కేసును ధర్మాసనం సోమవారం కొట్టివేస్తూ తుది తీర్పును చెప్పింది. అయితే, రూ.లక్షన్నర కోట్లతో చేపడుతోన్న మూసీ ప్రాజెక్ట్ దేశంలో అతిపెద్ద కుంభకోణం అంటూ ఉట్నూర్‌లో జరిగిన ఓ సభలో కేటీఆర్ ఆరోపించారు.
దేశంలో రాబోయే ఎన్నికల కోసం కావాల్సిన నిధులను కాంగ్రెస్ మూసీ ప్రాజెక్టును రిజర్వ్ బ్యాంక్‌లా వాడుకోవాలని చూస్తోందన్నారు.ఈ క్రమంలోనే కేటీఆర్ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ మహిళా నేత ఆత్రం సుగుణ ఉట్నూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగేలా కేటీఆర్ మాట్లాడారని పీఎస్‌లో ఫిర్యాదు చేయగా.. ఈ కేసులో నేడు హైకోర్టు రిలీఫ్ ఇచ్చింది.