ఉగ్రవాదుల ఊహా చిత్రాలను విడుదల చేసిన సెక్యూరిటీ ఏజెన్సీలు

-

పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరుల ఊహా చిత్రాలను విడుదల చేశాయి సెక్యూరిటీ ఏజెన్సీలు. ముగ్గురు ఉగ్రవాదులను ఆసిఫ్ ఫుజి, సులేమాన్ షా, అబు తల్హాగా గుర్తించారు. ఈ తరుణంలోనే పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడిన ముష్కరుల ఊహా చిత్రాలను విడుదల చేశాయి సెక్యూరిటీ ఏజెన్సీలు.

terrorist (1)

కాగా ఉగ్రదాడిలో బాధిత కుటుంబాలకు జమ్మూకాశ్మీర్ ఆర్థిక సాయం చేయనుంది. పహల్గాం ఉగ్రదాడిలోని బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించింది జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించింది జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం.

కాగా పహల్గామ్ ఉగ్రదాడికి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పహల్గామ్ ఉగ్రదాడికి కుట్ర చేసిన టెర్రరిస్ట్ ను గుర్తించారు. ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. చాపర్స్, డ్రోన్స్ తో ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. కాశ్మీర్ పోలీసులతో కలిసి ఆర్మీ జాయింట్ ఆపరేషన్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news