ఏపీ పదో తరగతి ఫలితాల్లో 600కు 600 మార్కులు సాధించింది ఓ యువతి. ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు కాసేపటి క్రితం విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి లోకేష్ చేతుల మీదుగా ఈ రిజల్ట్స్ విడుదల చేశారు. ఫలితాల కోసం విద్యార్థులు ఇక్కడ క్లిక్ చేయండి ( Results Available on https://results.bse.ap.gov.in).

ఇక ఈ తరుణంలోనే పదో తరగతి ఫలితాల్లో కాకినాడకు చెందిన విద్యార్థిని నేహాంజని అరుదైన రికార్డు సాధించింది. ఏపీ పదో తరగతి ఫలితాల్లో 600కు 600 మార్కులు సాధించింది ఓ యువతి. ఫలితాల్లో 600కు 600 మార్కులు సాధించింది. టెన్త్‌లో 600 మార్కులు రావడం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. దీంతో నేహాంజనిపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. నేహాంజని కాకినాడ భాష్యం స్కూల్లో చదువుకుంటోంది. పల్నాడు జిల్లా ఒప్పిచర్ల జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన పావని చంద్రిక 600లకు 598 మార్కులు సాధించింది.