ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో ఢిల్లీలో ఇవాళ అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ ఉంటుంది. ఈ మేరకు అన్ని పార్టీలకు ఆహ్వానం పలికారు రాజ్నాథ్ సింగ్. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై కేంద్రం తీసుకున్న నిర్ణయం పై చర్చించే అవకాశం ఉంది.

ఇది ఇలా ఉండగా , జమ్మూకశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో పర్యాటకులపై జరిగిన దారుణమైన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా, భారతదేశం పాకిస్థాన్‌పై కఠిన చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు, 1960లో పాకిస్థాన్‌తో చేసుకున్న “సింధు జలాల ఒప్పందం”ను రద్దు చేస్తున్నట్లు భారతదేశం ప్రకటించింది. అంతేకాకుండా, అటారీ-వాఘా సరిహద్దును కూడా మూసివేయాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో జరిగిన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) సమావేశం తర్వాత ఈ కీలక నిర్ణయాలు వెలువడ్డాయి.
- 1960 నాటి సింధూ జలాల ఒప్పందం రద్దు
- అటారీ-వాఘ సరిహద్దును మూసివేస్తున్నట్లు ప్రకటించిన విదేశాంగ కార్యదర్శి