రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని బీఆర్ఎస్ నేతలపై ఇప్పటికే పోలీసులు పలు కేసులను నమోదు చేశారు. నేటికీ కేసులు పెట్టే పర్వం కొనసాగుతూనే ఉంది. అయితే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు గులాబీ నేతలను వార్నింగ్ ఇస్తున్నట్లు తెలిసింది.

తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం పెద్ద వంగర గ్రామ వాట్సాప్ గ్రూప్‌లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నాడని, బీఆర్ఎస్ కార్యకర్తను చంపుతామంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అనుచరులు బెదిరిస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పాలకుర్తి నియోజకవర్గం పెద్ద వంగర గ్రామ వాట్సాప్ గ్రూప్‌లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నాడని, బీఆర్ఎస్ కార్యకర్తను చంపుతామంటూ బెదిరిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అనుచరులు pic.twitter.com/Msyp2Vuh6b
— Telugu Scribe (@TeluguScribe) April 24, 2025