రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. వరకట్న వేధింపుల కారణంగా ఓ వివాహిత తనువు చాలించింది. భర్త, అత్తమామల వేధింపుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగుచూసింది.
రామునూర్‌కు చెందిన ప్రసన్న లక్ష్మీ, తిరుపతి భార్యభర్తలు. అయితే, భర్తతో పాటు అత్తమామలు వరకట్నం తేవాలని తీవ్రంగా వేధింపులకు గురిచేసినట్లు సమాచారం. ఆ వేధింపులు భరించలేక జగిత్యాల పోచమ్మవాడలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కాగా, బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే ప్రసన్న లక్ష్మీ.. కొడుకు పుట్టడంతో జాబ్ మానేసింది. అత్తమామల వేధింపులు, భర్త టార్చర్ కారణంగా తన కుమారుడిని తల్లిదండ్రులు పెంచాలని అద్దంపై రాసిన ఆమె ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.