తెలంగాణ రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. కాశ్మీర్ లో చిక్కుకున్న తెలంగాణ పర్యాటకుల కోసం హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేశారు. వారిని స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు చేపడుతున్నామని ఈ సందర్బంగా మంత్రి జూపల్లి కృష్ణ రావు పేర్కొన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులు, కేంద్ర ఏజెన్సీ లతో ప్రభుత్వం సమన్వయం చేసుకుంటున్నట్లు వెల్లడించారు.

జమ్ము, కాశ్మీర్ లోప్రయాణించిన పర్యాటకుల వివరాలు వెంటనే అందించాలని అన్ని టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లను కోరారు మంత్రి జూపల్లి కృష్ణ రావు. హెల్ప్ లైన్ నంబర్లకు కాల్ చేసి సహాయం తీసుకోవాలని కోరారు ప్రభుత్వం. హెల్ప్ లైన్ నంబర్లు – 9440816071, 9010659333, 040 – 23450368 లను సంప్రదించాలని పేర్కొన్నారు మంత్రి జూపల్లి కృష్ణ రావు.
- కాశ్మీర్ లో చిక్కుకున్న తెలంగాణ పర్యాటకుల కోసం హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు
- వారిని స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు చేపడుతున్నామన్న మంత్రి జూపల్లి
- హెల్ప్ లైన్ నంబర్లు – 9440816071, 9010659333, 040 – 23450368