ఇదేమీ దొంగలరాజ్యం.. కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల ధర్నా

-

రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనడం లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రం వద్ద రోడ్డుపై బైఠాయించి రైతులు ధర్నాకు దిగారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అంటూ నినాదాలు చేస్తున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తాఫానగర్ గ్రామ కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ధర్నా చేపట్టారు. కొనుగోలు ప్రక్రియను ప్రభుత్వం వెంటనే వేగవంతం చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. తూకం వేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో లారీలు లేక వారం రోజుల పాటు నిలువ చేస్తే ఆ నష్టాన్ని భరించాల్సింది ఎవరు? అంటూ వారంతా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే కలుగజేసుకుని అన్నదాతల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news