పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. విశాఖపట్నానికి చెందిన జె.డి. చంద్రమౌళి, కావలికి చెందిన ఐటి ఉద్యోగి మధుసూదన్ అనే ఇద్దరు వ్యక్తులు పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందారు.
వారి కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అటు ఉగ్రదాడిలో బాధిత కుటుంబాలకు జమ్మూకాశ్మీర్ ఆర్థిక సాయం చేయనుంది. పహల్గాం ఉగ్రదాడిలోని బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించింది జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వా రికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించింది జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం. కాగా పహల్గామ్ ఉగ్రదాడికి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పహల్గామ్ ఉగ్రదాడికి కుట్ర చేసిన టెర్రరిస్ట్ ను గుర్తించారు. ఉగ్రవా దుల కోసం వేట కొనసాగుతోంది. చాపర్స్, డ్రోన్స్ తో ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. కాశ్మీర్ పోలీసులతో కలిసి ఆర్మీ జాయింట్ ఆపరేషన్ చేస్తున్నారు.