తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలెర్ట్. తెలంగాణలో ఎండ తీవ్రత తట్టుకోలేక జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. గడిచిన 3 రోజుల్లో వడదెబ్బతో దాదాపు 30 మంది మృతి చెందారు. ఎండ తీవ్రత పెరగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు.

ఇక అటు నేడు ఏపీలోని పలు జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు ఉండనున్నట్లు పేర్కొంది వాతావరణ శాఖ. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు ఉంటాయి. మరో 28 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు కూడా కురిసే ఛాన్స్ ఉందని ఈ మేరకు పేర్కొంది వాతావరణ శాఖ.