అతివేగం ప్రమాదకరం అని అటు ప్రభుత్వాలు, పోలీసు యంత్రాంగం ఎన్నిమార్లు చెప్పినా కొందరు వినిపించుకోవడం లేదు. దీనికి తోడు హెల్మెట్ లేకుండా ప్రమాణిస్తూ అతివేగం కారణం వారు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇతరులు ప్రమాదానికి లోనయ్యేలా చేస్తున్నారు.
తాజాగా బెంగళూరులో ఇటువంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. చావు అంచులదాకా వెళ్లి ఇద్దరు యువకులు బతికి బయటపడ్డారు.అతి వేగంగా స్కూటీని నడుపుతూ ఆగి ఉన్న వ్యాన్‌ను ఢీకొట్టారు.దీంతో వాహనం అదుపు తప్పడంతో రోడ్డుపై జారిపడిపోయారు. పక్కనే వెళ్తున్న బస్సు నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆ బస్సు మీద నుంచి వెళ్లితే ఆ ఇద్దరూ స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయేవారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.