రాష్ట్రంలో అన్నదాతలు మరోసారి ఆగ్రహించారు. ధాన్యం కొనుగోలు చేయాలని రోడ్డుపై రైతుల ఆందోళన బాట పడుతున్నారు. ఈ క్రమంలోనే కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
ధాన్యాన్ని కల్లాల్లో పోసి 10 రోజులు గడచినా ఐకేపీ సెంటర్లో తూకం వేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాల కారణంగా నిలువ ఉన్న ధాన్యం తడిసి రైతులు నష్ట పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల నిరసన కారణంగా కామారెడ్డి – కరీంనగర్ రహదారిపై పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ధాన్యం కొనాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆందోళన తెలుపుతున్నారు.