‘శుక్ర’, ‘మాటరాని మౌనమిది’, ‘ఏ మాస్టర్ పీస్’ చిత్రాలతో ప్రేక్షకుల మనసు దోచిన పూర్వాజ్… ఇప్పుడు ఓ సరికొత్త సై-ఫై యాక్షన్ థ్రిల్లర్‌తో ధీటుగా తిరిగి వచ్చారు. తన కథను తానే నటించి, తెరమీద మాయాజాలాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నాడు. పేరు ‘కిల్లర్’. ఏప్రిల్ 30, 2025న తెలుగు, కన్నడ భాషల్లో విడుదలైన ఈ గ్లింప్స్ చూస్తేనే సినిమాపై భారీ అంచనాలు తలెత్తుతున్నాయి. ఈసారి కథనం మరింత మేధస్సుతో కూడినది. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సూపర్ హీరో థీమ్‌లకు ఎమోషనల్ డెప్త్ జోడించి, ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నమే ‘కిల్లర్’. “ప్రాచీన వైమానిక శాస్త్రంలో మానవ మేధస్సు రహస్యాలు… ఆత్మ కలిగిన యంత్రాలు నిజంగా ఏర్పడతాయా?” అనే గంభీర వాయిస్ ఓవర్‌తో గ్లింప్స్ మొదలవుతుంది.
హీరోయిన్ జ్యోతి రాయ్ పోషించిన ‘డీ బౌండ్’ డిజార్డర్ పాత్ర… ఆమెను ఓ మారిపోతున్న శక్తిగా చూపిస్తుంది. “ఆ దిక్కు దాటి వస్తే… నన్నెవరూ ఆపలేరు” అనే ఆమె మాటలు మతిపోగొట్టేలా ఉన్నాయి. ఆమె చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లు, మైండ్ బ్లోయింగ్ స్టంట్స్ ఈ గ్లింప్స్‌కు హార్ట్‌బీట్‌లా నిలిచాయి.
దర్శకుడిగా, నటుడిగా పూర్వాజ్ చివర్లో చెబుతున్న “మొదలెడదామా?” అనే డైలాగ్ సినిమాపై మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. విజువల్స్ విషయంలోను, వీఎఫ్‌ఎక్స్ స్థాయిలోను ‘కిల్లర్’ అంచనాలకు మించి ఉండేలా ఉందని టీం చెబుతోంది. థింక్ సినిమా బ్యానర్‌పై పూర్వాజ్, ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తుండగా, ఏయు అండ్ ఐ, మెర్జ్ ఎక్స్‌ఆర్ సంస్థలు సహనిర్మాతలుగా ఉన్నాయి.