Chennai Super Kings become the first team to be eliminated from IPL 2025: ఐపీఎల్ 2025 నుంచి చెన్నై ఎలిమినేట్ అయ్యింది. తాజాగా చెన్నై తో జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ విజయం సాధించింది. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

191 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన PBKS 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి టార్గెట్ పూర్తి చేసింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ 54, శ్రేయస్ అయ్యర్ 72 పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో పతి రాణా 2, ఖలీల్ అహ్మద్ 2, నూర్ అహ్మద్, జడేజా చెరో వికెట్ తీశారు. దింతో ఐపీఎల్ 2025 నుంచి చెన్నై ఎలిమినేట్ అయ్యింది.