రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని కాంగ్రెస్ సర్కార్ కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే భారీ నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా నాగర్కర్నూల్, వనపర్తిలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పరిశీలనకు మంత్రుల బృందం బయలుదేరింది.
మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తెలంగాణ ప్లానింగ్ కమిషన్ చైర్మన్ డాక్టర్ జి. చిన్నారెడ్డి, ఎంపీ డాక్టర్ మల్లు రవి హెలికాప్టర్లో నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాలకు బయలుదేరి వెళ్లారు. వీరు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన కీలక పెండింగ్ పనులు నర్లాపూర్ రిజర్వాయర్ పంప్ హౌస్, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం, ఎడుల, తిగలపల్లి, ఉయ్యాలవాడ కాలువ నిర్మాణాలను పరిశీలించనున్నారు. అనంతరం ప్రభుత్వానికి ఓ నివేదిక అందించనున్నట్లు సమాచారం.