అల్లుఅర్జున్ ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు : శ్రీతేజ్ తండ్రి

-

పుష్ప -2 మూవీ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య 70 ఎంఎంకు రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా.. బాలుడు తీవ్రంగా గాయపడి ఎట్టకేలకు కోలుకున్నాడు. కొడుకు పరిస్థితిపై తండ్రి భాస్కర్ మీడియాతో మాట్లాడారు.

శ్రీతేజ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడని పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు రీహాబిలిటేషన్ సెంటర్‌‌కు తీసుకొచ్చామన్నారు. డాక్టర్లు కడుపు సర్జరీ చేసి పైప్ ద్వారా ఫుడ్ అందించారని.. ఇప్పుడు కొంచెం స్టేబుల్ గా ఉండి రెండు కేజీల బరువు పెరిగాడని చెప్పారు. ఫిజియోథెరపీ చేస్తే నరాలు రిలీఫ్ అయి రెస్పాండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వైద్యులు తెలిపారని.. ఇచ్చిన హామీ మేరకు అల్లు అర్జున్ సిబ్బంది ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారని శ్రీతేజ్ తండ్రి భాస్కర్ వెల్లడించారు.

 

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news