కులగణనపై చర్చకు సిద్ధమా.?.. కిషన్‌రెడ్డికి జగ్గారెడ్డి సవాల్

-

తెలంగాణలో కుల గణనపై బీజేపీ నేతలకు నిద్ర పట్టడం లేదని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో బీజేపీతో పాటు సీపీఐ, బీఆర్ఎస్ పార్టీలు కూడా చర్చలో పాల్గొన్నాయని గుర్తు చేశారు. క్షేత్ర స్థాయిలో అధికారులు ఇంటింటికీ వెళ్లి సర్వే చేశారని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి – “కుల గణనపై మీకు అవగాహన ఉందా? చర్చకు సిద్ధమా?” అని సవాల్ విసిరారు.

ఈ సర్వే విజయవంతంగా పూర్తయిందని, గవర్నర్ కూడా దీనికి ఆమోదం తెలిపారని చెప్పారు. అప్పుడు సర్వే తప్పులేనిదే కదా అని ప్రశ్నించారు. సర్వే జరిగిన సమయంలో కిషన్ రెడ్డి తెలంగాణలో లేరు అనిపిస్తుందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు కూడా దీనికి మద్దతు తెలిపిన సంగతి గుర్తు చేస్తూ..” వాళ్లపై కూడా మీకు అనుమానమా?” అని నిలదీశారు. కొన్ని చోట్ల సర్వేలో పాల్గొనని వారు ఉండటంతో వారికి మరోసారి అవకాశం కల్పించామని స్పష్టం చేశారు.

కిషన్ రెడ్డి ఇటీవలిచ్చే స్టేట్మెంట్లు కేంద్ర బీజేపీ పార్టీ ఒత్తిడితోనే వచ్చుంటాయని తెలిపారు. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటం కేంద్రానికి నచ్చడం లేదని, అందుకే రాజకీయ విమర్శలు పెంచుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు బీజేపీ మాటలను నమ్మవద్దని జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news