ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. రివ్యూ కమిటీలో ఉన్న ఉన్నతాధికారులను దర్యాప్తు బృందం విచారణ చేయనుంది. సీఎస్,హోం శాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, సాధారణ పరిపాలన విభాగం అధికారులను విచారించనున్నారు అధికారులు. ఎస్ఐబీలో లీగల్‌గానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని హైకోర్టుకు తెలిపారు ప్రభాకర్ రావు.

రివ్యూ కమిటీ అనుమతితోనే 2023, డిసెంబరులో ఫోన్ ట్యాపింగ్ డేటా ధ్వంసం చేశామని పేర్కొన్నారు ప్రభాకర్ రావు. రివ్యూ కమిటీలోని అప్పటి సభ్యులను విచారించాలని దర్యాప్తు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు, హైకోర్టులో ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేశారు. ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.