హైదరాబాద్‌కు చేరుకున్న మిస్ బ్రెజిల్ జెస్సికా.. గ్రాండ్ వెల్‌కమ్

-

హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వీటిని నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొనేందుకు వివిధ దేశాల సుందరీమణులు హైదరాబాద్‌కు చేరుకుంటుండగా.. తాజాగా మిస్ బ్రెజిల్ జెస్సికా స్కాండియుజి పెడ్రోసో నగరానికి చేరుకున్నారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఈ సుందరీమణికి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల నడుమ అధికారులు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు.ఈనెల 10 నుంచి 31వ తేదీ వరకు గచ్చిబౌలి స్టేడియంలో మిస్‌ వరల్డ్‌ పోటీలు జరగనున్నాయి.ఇందులో 120 దేశాల ప్రతినిధులు పాల్గొంటుండగా.. 150కు పైగా దేశాల్లో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ పోటీల ద్వారా తెలంగాణ క‌ల్చ‌ర్‌ను ఇతర దేశాలకు తెలియజేసేలా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లను చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news