ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ నాయకులు, మాజీ మంత్రి కె ఎస్ జవహర్ నివాసంలో భారీ చోరీ జరిగింది. కొంతమంది గుర్తి తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి… విలువైన వస్తువులను దొంగిలించినట్లు… వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో పది రోజులుగా… జవహర్ విజయవాడలోనే ఉంటున్నారు.

అటు గత నెల 30వ తేదీన జవహర్ కుటుంబ సభ్యులు మొత్తం తిరువూరు దర్శనానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఇంట్లో ఎవరూ లేకుండా ఉన్నారు. ఇది ఆసరాగా చేసుకున్న దొంగలు…. ఇంట్లో విలువైన వస్తువులు దొంగిలించారు. అయితే శనివారం రోజున జవహర్ ఇంటికి ఆయన అనుచరుడు మొక్కలకు నీళ్లు పట్టడాని కి వెళ్ళాడు. ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించాడు.. దింతో ఈ దొంగతనం పై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ నాయకులు, మాజీ మంత్రి కె ఎస్ జవహర్.