బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరికి ఊహించని షాక్ తగిలింది. బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి గాయపడ్డారు. లండన్ పర్యటనకు వెళ్లిన ఆయన.. అక్కడున్న ఓ సూపర్ మార్కెట్‌లోని వాష్‌రూమ్‌లో కిందిపడినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన కుడి భుజం వద్ద ఎముక విరగడంతో హైదరాబాద్‌కు తీసుకొస్తున్నట్లు సమాచారం.

HYDలో సుజనా చౌదరికి సర్జరీ చేసే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సుజనా చౌదరికి తీవ్ర గాయమైనట్లు తెలియడంతో బీజేపీ నేతలు ఆరా తీస్తున్నారు. ఇక బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరికి జరిగిన సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.