మంత్రి పొన్నం ప్రభాకర్ తో ఆర్టీసీ సంఘాల నేతలు చర్చలు

-

మంత్రి పొన్నం ప్రభాకర్ తో ఆర్టీసీ సంఘాల నేతలు చర్చలు జరిగాయి. సమ్మె ఆలోచన విరమించుకోవాలని ఆర్టీసీ సంఘాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రిని కలిసిన ఆర్టీసీ INTUC కార్మిక సంఘం జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు మంత్రి పొన్నం.

RTC union leaders hold talks with Minister Ponnam Prabhakar
RTC union leaders hold talks with Minister Ponnam Prabhakar

ఇక అటు ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగనుంది. సమ్మె చేస్తే ఎస్మా ప్రయోగిస్తామని ప్రభుత్వం హెచ్చరించినా లెక్కచేయని ఆర్టీసీ జేఏసీ.. ఇవాళ అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగనున్నారు. దింతో రేపటి నుంచి డిపోలకే పరిమితం కానున్నాయి ఆర్టీసీ బస్సులు.

ఆర్టీసీ కార్మికుల 21 సమస్యలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. అటు ఆర్టీసీ కార్మిక జేఏసీ రెండుగా చీలింది. సమ్మెకు వెంకన్న వర్గం సిద్ధమైంది. అటు సమ్మె వద్దు అంటోంది అశ్వత్థామ రెడ్డి వర్గం. అశ్వత్థామ రెడ్డి ఆర్టీసీ కార్మిక ద్రోహి అని ధ్వజమెత్తింది తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతల సంఘం.

Read more RELATED
Recommended to you

Latest news