కోసుకొని తినడానికి నువేమన్నా మామిడి పండా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. నిన్న రేవంత్ రెడ్డి కామెంట్స్ పై స్పందించారు. ఎకానమీ క్లాస్లో ప్రయాణం చేస్తున్నా అంటున్నావు, దమ్ముంటే 43 సార్లు నీ ఢిల్లీ ప్రయాణాల ఖర్చు మీద శ్వేతపత్రం విడుదల చెయ్ రేవంత్ రెడ్డి అని డిమాండ్ చేశారు కేటీఆర్.

చివరిసారిగా చెప్తున్నా రేవంత్ రెడ్డి.. కేసీఆర్ని వ్యక్తిగతంగా దూషిస్తే నీ నాలుక చీరేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్. ఫోర్త్ సిటీలో 2000 ఎకరాలు ఎట్లా కొన్నావు రేవంత్ రెడ్డి ? నీ అన్నదమ్ములు, నీ బామ్మర్ది, నీ కుటుంబ సభ్యులు అందరి ఆదాయం పెంచుకున్నావు, కానీ రాష్ట్ర ఆదాయం ఎందుకు పెరగలేదని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి లీటర్ రూ.200 చేసి సంపద పెంచాలని అనుకుంటున్నాడు ధరలు పెంచడం కాదు రేవంత్ రెడ్డి, బుర్ర పెంచు.. సంపద పెంచే ఆలోచన చేయి అన్నారు.
కోసుకొని తినడానికి నువేమన్నా మామిడి పండా
ఎకానమీ క్లాస్లో ప్రయాణం చేస్తున్నా అంటున్నావు, దమ్ముంటే 43 సార్లు నీ ఢిల్లీ ప్రయాణాల ఖర్చు మీద శ్వేతపత్రం విడుదల చెయ్ రేవంత్ రెడ్డి – కేటీఆర్ https://t.co/qST0r2CDhM pic.twitter.com/kR4Xycg6ub
— Telugu Scribe (@TeluguScribe) May 6, 2025