జమ్ముకాశ్మీర్‌లోని పహెల్గాం ఉగ్రదాడిపై సోమవారం ఐరాస భద్రతామండలి స్పందించింది.
ముందుగా పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ఐరాస భద్రతామండలి.. పాకిస్థాన్ వెల్లడించిన పలు అంశాలను భద్రతా మండలి సభ్య దేశాలు తిరస్కరించాయి.
ద్వైపాక్షిక చర్చలతో భారత్‌తో ఉన్న సమస్యలు పరిష్కరించుకోవాలని సూచనలు చేశాయి. పాక్‌కు కీలక ప్రశ్నలు సంధించిన భద్రతామండలి సభ్యదేశాలు.. లష్కరే తోయిబా ప్రమేయంపైనా పాక్‌ను ఆరా తీసింది. ప్రత్యేకంగా ఒక మతం పర్యాటకులనే కాల్చి చంపడంపై ఐరాస తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, అటు అంతర్జాతీయంగా పాక్ ను ఏకాకి చేయాలనే భారత విదేశాంగ శాఖ తీవ్రంగా కృషి చేస్తున్నది. దీనికి తోడు పహెల్గాం ఉగ్రదాడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.