ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ భారత్ మీద ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని ఉవ్విళ్లూరుతున్నది. అందుకే నేరుగా యుద్ధానికి సిద్ధం అని చెప్పలేక అమాయక ప్రజలపై తన ప్రతాపం చూపిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదేపదే ఉల్లంగిస్తున్నది. గత వారం రోజులుగా పాక్ రేంజర్లు బోర్డర్లో బరితెగిస్తున్నారు.
ఉత్తర కాశ్మీర్‌లోని ఉరిలో గల సలామాబాద్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ దళాలు జరిపిన కాల్పుల్లో అనేక ఇళ్లు భారీగా దెబ్బతిన్నాయన్నాయి. మోర్టార్ షెల్లింగ్ కారణంగా కుటుంబాలు భయంతో పారిపోవాల్సి వచ్చిందని స్థానిక అధికారులు నివేదించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేశారు.అందులో కాలిపోయిన గోడలు , పగిలిన కిటికీలు కనిపిస్తున్నాయి.