జైపూర్‌లో హై అలర్ట్‌..సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియానికి బాంబు బెదిరింపులు

-

ఐపీఎల్ 2025 నేపథ్యంలో బాంబు కలకలం చోటు చేసుకుంది. జైపూర్‌ – సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో బాంబు పెట్టినట్టు బెదిరింపులు వస్తున్నాయి. ఈ నెల 16న సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్ Vs పంజాబ్ కింగ్స్ మ్యాచ్ నేపథ్యంలో జైపూర్‌లో హై అలర్ట్‌ ప్రకటించారు. సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియం చుట్టుపక్కల భారీగా మోహరించారు పోలీసులు.

High alert in Jaipur Bomb threats to Sawai Mansingh Stadium
High alert in Jaipur Bomb threats to Sawai Mansingh Stadium

సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియం లోపల, వెలుపల గాలిస్తున్నాయి బాంబు స్వ్కాడ్‌లు. స్టేడియం లోపల ఉన్నవారిని పంపించి, చుట్టుపక్కల ఉన్న వారిని ఖాళీ చేయించారు జైపూర్‌ పోలీసులు.

కాగా ఇండియన్ ఆర్మీ చేస్తున్న దాడులపై పాకిస్తాన్ కీలక ప్రకటన చేసింది. మొత్తం తొమ్మిది ప్రాంతాలలో ఇండియా డ్రోన్ దాడి చేసినట్లు సంచలన ప్రకటన చేసింది పాకిస్తాన్. పాకిస్తాన్ పై భారత్ నిన్న రాత్రి ఒక్కరోజే హరూక్ డ్రోన్లతో… దాడి చేసిందని ఆ దేశ ఆర్మీ అధికారి అహ్మద్ షరీఫ్ కీలక ప్రకటన చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news