ఉచిత బస్సు పై తెలంగాణ ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. ఆధార్ కార్డు తో పాటు మిగతా కార్డులు కూడా పనిచేస్తాయని తాజాగా ఉచిత బస్సుపై సజ్జనర్ కీలక ప్రకటన చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళల కోసం ఉచిత బస్సు అమలు చేస్తుందని ఈ సందర్భంగా ఆయన వివరించారు.

కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం ఒరిజినల్ ఆధార్ కార్డ్ అలాగే ఓటర్ ఐడి, లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఇతర గుర్తింపు కార్డులు కండక్టర్లకు చూపిస్తే జీరో టికెట్లు తీసుకోవచ్చని ఈ సందర్భంగా వెల్లడించారు సజ్జనర్. ఆధార్ కార్డు ఒక్కటే ప్రామాణికం కాదని… ఓ నెటిజన్ సజ్జనర్ కు ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టాడు. ఈ నేపథ్యంలోనే స్పందించిన… ఆర్టీసీ ఎండీ సజ్జనర్ ప్రకటన చేశారు. కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం ఒరిజినల్ ఆధార్ కార్డ్ అలాగే ఓటర్ ఐడి, లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఇతర గుర్తింపు కార్డులు కండక్టర్లకు చూపిస్తే జీరో టికెట్లు తీసుకోవచ్చని ఈ సందర్భంగా వెల్లడించారు సజ్జనర్.