జమ్మూకశ్మీర్‌లో హై అలెర్ట్ ప్రకటించారు. జమ్మూకశ్మీర్‌లో భారీ శబ్దాలతో పేలుళ్లు జరుగుతున్నాయని ఎక్స్ వేదికగా తెలిపారు సీఎం ఒమర్ అబ్దుల్లా. జమ్మూ మరియు చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రాకూడదని, సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని వెల్లడించారు ఒమర్ అబ్దుల్లా.

ఆధారాలు లేని, ధృవీకరించని వార్తలను వ్యాప్తి చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఇక అటు వరుసగా రెండో రోజు సాయంత్రం పాకిస్తాన్ డ్రోన్ల ద్వారా దాడికి యత్నించింది. యూరీ, కుప్వారా, పూంచ్, నౌగామ్ సెక్టార్లలో పాక్ సైన్యం కాల్పులకు పాల్పడింది. ఈ చర్యలతో జైసల్మేర్, యూరీలో అలర్ట్ ప్రకటించబడగా, అక్కడ సైరన్లు మోగించబడ్డాయి. భారత భద్రతా దళాలు దాడులకు సమర్థంగా ప్రతిస్పందించాయి. అలాగే, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ సరిహద్దుల్లో హై అలర్ట్ కొనసాగుతుంది. సాంబ, జమ్మూ, పఠాన్ కోట్, పోఖ్రాన్ ప్రాంతాల్లో పాక్ డ్రోన్లు కనిపించాయి. అయితే భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ తక్షణమే స్పందించి పాక్ డ్రోన్లను కూల్చివేసింది.